పహల్గాం దాడులకు ఉగ్రవాదులు పక్కా స్కెచ్ వేశారు. బైసరన్ చేరుకునేందుకు ఉగ్రమూకలు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఉగ్రవాదులు వారి ప్రణాళిక అమలు చేసేందుకు కోకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు కాలి నడకన వచ్చినట్లు గుర్తించారు. 25 మందిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. దాడి సమయంలో ఉగ్రవాదులు ఓ స్థానికుడి నుంచి రెండు మొబైల్ ఫోన్లు దొంగిలించారని తేలింది.
ఈ రక్తపాతంలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరిలో ముగ్గురు పాకిస్థానీయులు, కాగా ఒకడు స్థానికుడు. ఉగ్రవాది ఆదిల్ థోకర్ స్థానికుడిగా గుర్తించారు. అనంతనాగ్ జిల్లా బిజ్ బెహారాకు సమీపంలోని గురీ గ్రామానికి చెందిన వాడు. చాలా కాలం నుంచి ఉగ్రవాదులకు సన్నిహితంగా మెలుగుతున్నాడని తేలింది. 2018లో పాక్ నుంచి విద్యార్ధి వీసా సంపాదించి సరిహద్దులు దాటాడు.
విద్యార్దిగా వెళ్లి ఉగ్రవాదిగా శిక్షణ పొంది భారత్‌లో అడుగు పెట్టాడు. అనేక దాడులకు ప్రణాళికలు వేశాడు. అమలు చేశాడు. పహల్గాం ఉగ్రదాడి కేసును విచారిస్తోన్న జాతీయ దర్యాప్తు సంస్థ అనేక కీలక విషయాలను రాబట్టింది.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు