జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి తరవాత పాక్ మంత్రులు, మాజీ మంత్రులు నోటికొచ్చినట్లు పేట్రేగిపోతున్నారు. తాజాగా పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు. భారత్‌పై దాడికి 130 అణుబాంబులు సిద్దంగా ఉంచామని, అవి ఎక్కడ ఉన్నాయో కూడా ప్రపంచానికి తెలియదన్నారు. భారత్ సింధూ జలాలను నిలిపివేస్తే, పూర్తి స్థాయి యుద్ధానికి సిద్దం కావాలన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అణుబాంబులు దాచినట్లు చెప్పుకొచ్చారు. భారత్ కవ్వింపులకు దిగితే దాడికి పాక్ సిద్దంగా ఉందన్నారు.
మా ఆయుధాలు, అణుబాంబులు, క్షిపణులు ప్రదర్శనకు కాదు. మా బాలిస్టిక్ క్షిపణులు భారత్ నగరాలను లక్ష్యంగా చేసుకుంటాయని అబ్బాసీ హెచ్చరించారు. పాక్ నుంచి ఎదురయ్యే పరిణామాలను ఢిల్లీ అర్థg చేసుకుంటోందన్నారు. రెండు రోజులు గగనతలం మూసివేస్తేనే భారత వాయురంగం గందరగోళంలో పడిందన్నారు. పది రోజుల్లో భారత విమానాయానరంగం మూతపడుతుందన్నారు.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు