ఓ దొంగ ఏకంగా అమెరికా మంత్రి బ్యాగునే కాజేశాడు. అమెరికాలో దేశ అంతర్గత భద్రతకు భాద్యత వహించే డిపార్టుమెంట్ ఆప్ హోమ్ ల్యాండ్ సెక్రటరీ క్రిస్టీ నియోమ్ ఖరీదైన బ్యాగును ఓ దొంగ చాకచక్యంగా తస్కరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఏప్రిల్ 20వ తేదీన క్రిస్టి నయోమ్ కుటుంబ సభ్యులతో కలసి ఈస్టర్ పార్టీ కోసం వైట్ హౌస్ సమీపంలోని రెస్టారెంటుకు వెళ్లారు. ఆ సమయంలో ఓ వ్యక్తి బేస్ బాల్ క్యాప్, ముఖానికి మాస్క్, ముదురు రంగు దుస్తులు ధరించి రెస్టారెంటులోకి వచ్చాడు. నియోమ్ పక్క టేబుల్‌పై కూర్చొని, బ్యాగు తీసుకుని పరారయ్యాడు. ఆ బ్యాగు విలువ 4 లక్షలు కాగా, అందులో 3 వేల అమెరికా డాలర్ల నగదు కూడా ఉంది. కొన్ని రహస్య పత్రాలు, తాళం చెవులు ఉన్నాయి. మంత్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారం రోజుల కష్టపడి దొంగను పట్టుకున్నారు.
అరెస్టైన దొంగ ఈస్ట్ కోస్ట్ గ్యాంగు సభ్యుడని గుర్తించారు. ఈ ముఠా విలువైన వస్తువులు తస్కరించడంలో దిట్ట. నియోమ్‌కు రక్షణగా సాధారణ దుస్తుల్లో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఉంటారు. వారు కూడా దొంగతనం గుర్తించలేక పోయారు.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు