మలయాళ చిత్ర దర్శకులు ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హంజాలను కొచ్చిన్‌లోని దర్శకుల అపార్టుమెంటులో పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది మొత్తంలో వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజులుగా వారు మత్తు పదార్ధాలు వాడుతున్నారనే సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించి ఇద్దరు దర్శకులను అదుపులోకి తీసుకున్నారు. సినిమా కథలు చెప్పేందుకు ఆ ఇద్దరు ఒకే అపార్టుమెంటు ఫ్లాటులో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే నటుడు షైన్ టామ్ చాకోను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల విడుదలైన జింఖానా చిత్రానికి ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించారు. తమాషా చిత్రానికి అష్రఫ్ హంజా దర్శకుడిగా పనిచేశారు. వీరు గత కొంత కాలంగా గంజాయి వాడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వారికి మత్తు పదార్థాలు ఎవరు సరఫరా చేస్తున్నారనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు