జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి కేసును స్థానిక పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తీసుకుంది. ఉగ్రదాడి సమయంలో అక్కడ నుంచి సురక్షితంగా బయటపడ్డ పర్యాటకులను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు.పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు ఇప్పటికే అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. పహల్గాం నుంచి బైసరన్ వెళ్లే మార్గంలో పలు ఆధారాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.
పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తరవాత సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ దళాలు బురద మార్గంలో 40 నిమిషాల్లో అక్కడకు చేరుకున్నాయని కేంద్రం తెలిపింది. ఆ తరవాత స్థానిక పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పహల్గాంకు వచ్చే వెళ్లే మార్గాల్లో సీఆర్పీఎఫ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది.
జమ్ము కశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. వారికి సహకరించిన వారి ఇళ్లను కూడా సైనికులు పేల్చి వేస్తున్నారు. మూడు రోజుల్లో 14 ఇళ్లు పేల్చి వేశారు. ఇందులో లష్కరేతొయ్యబా కీలక కమాండర్ లల్లి ఇళ్లు కూడా ఉంది.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు