వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ప్రాథమికంగా ఓ జాబితాను సిద్దం చేశారు. ఇప్పటి వరకు 6 రకాల బడులు నడుస్తున్నాయి. వాటి స్థానంలో 9 రకాల బడులు అందుబాటులోకి తేనున్నారు. ఉన్నత పాఠశాలల్లోనే 4 రకాలు ఉన్నాయి. ప్రాథమిక బడుల్లో 45 మంది కన్నా విద్యార్థులు తక్కువ ఉంటే బేసిక్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా వ్యవహరిస్తారు. 45 మంది కన్నా విద్యార్థులు ఎక్కువ ఉంటే ప్రతి తరగతికి ఉపాధ్యాయుడిని కేటాయిస్తారు. తరవాత వీటిని ఆదర్శ ప్రాథమిక, ఆదర్శ ఉన్నత పాఠశాలలుగా ఏర్పాటు చేస్తారు.
ఒకటి నుంచి పది తరగతుల వరకు బేసిక్, ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఏపీలో 900 వరకు ఉండనున్నాయి. ఇంటర్మీడియట్ కూడా ఉండే విధంగా హైస్కూల్ ప్లస్ పేరుతో కొనసాగుతాయి. కొన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు ఉంటాయి. 240 ప్రాథమికోన్నత పాఠశాలలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మొత్తం 5 రకాల బడులు తీసుకురావాలని ప్రయత్నించగా, పరిస్థితులకు అనుగుణంగా 9 రకాల బడులు చేయాల్సి వచ్చింది.
ఎల్కేజీ, యూకేజీ అంటే పూర్వ ప్రాథమిక విద్య 1,2 ఉండే బడులకు శాటిలైట్ ఫౌండేషన్ బడులుగా పిలుస్తారు. అంగీన్వాడీల్లో ఎల్కేజీ, యూకేజీ పూర్తి చేస్తారు. ఇవి మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉంటాయి.
పీపీ 1,2తో పాటు ఒకటి, రెండు తరగతులు కలిపి ఫౌండేషన్ బడులుగా ఉంటాయి. పీపీ1,2తోపాటు, ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండే వాటిని బేసిక్ ప్రాథమిక బడులుగా ఏర్పాటు చేస్తారు. ఒకటి నుంచి ఐదు తరగతుల్లో 45 మంది విద్యార్ధులు ఉంటే వాటిని బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగా పరిగణిస్తారు.
పీపీ 1,2, ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంది, 45 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే వాటిని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా వ్వవహరిస్తారు. ప్రాథమికోన్నత బడులు కొనసాగుతాయి. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా అప్పర్ ప్రైమరీ బడులను కొనసాగించాని నిర్ణయించారు.
6,7,8 తరగతుల్లోని విద్యార్ధుల సంఖ్య ఆధారంగా కొన్ని బడులను ఉన్నత పాఠశాలలుగా, మరికొన్నింటిని ప్రాథమిక బడులుగా మార్పు చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్నింటికి కొనసాగిస్తున్నారు. ఆరు నుంచి పది తరగతులు ఉండే ఉన్నత పాఠశాలలు కొనసాగుతాయి.
ఒకటి నుంచి పది తరగతులు ఉండే బేసిక్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు.117 జీవో రద్దుతో గతంలోని ఉన్నత పాఠశాలలను తరలించి 3,4,5 తరగతులను వెనక్కు తీసుకొచ్చి, ప్రాథమిక బడుల్లో విలీనం చేయడంతో సమస్యలు తలెత్తాయి.వాటిని అక్కడే కొనసాగించాలని నిర్ణయించారు. వీటికి అదనంగా ఒకటి, రెండు తరగతులను చేర్చనున్నారు.
ఒకటి నుంచి పది తరగతులు ఉండే ఆదర్శ ప్రాథమిక, ఆదర్శ ఉన్నత పాఠశాలలు
ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమికలో 45 కంటే ఎక్కువ విద్యార్థులకు, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటారు.
రాష్రంలో 294 హైస్కూల్ ప్లస్ బడులు ఉన్నాయి. వీటిల్లో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు ఉంటాయి. ఇక్కడ కూడా పాఠశాల ఉపాధ్యాయులే పాఠాలు చెబుతున్నారు. అందుకే వీటికి పాఠశాల విద్యాశాఖలో కొనసాగించాలని నిర్ణయించారు.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు