బలగాలు, మావోయిస్టుల కాల్పులతో కర్రెగుట్టలు దద్దరిల్లుతున్నాయి. బ్లాక్ హిల్స్‌గా పేరున్న ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టులను మూడు రోజులుగా బలగాలు చుట్టుముట్టాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టులు తిష్టవేశారనే సమాచారంతో 5 వేల మంది పారాబలగాలు, పోలీసులు చుట్టుముట్టారు. దట్టమైన అటవీ ప్రాంతంలో 1000 మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టల సమీపంలోనే బలగాలు క్యాంపులు
ఏర్పాటు చేసుకున్నారు. కర్రెగుట్టలపై పది డ్రోన్లతో నిఘా వేశారు. అత్యాధునిక హెలికాఫ్టర్లను రంగంలోకి దింపారు.
ములుగు జిల్లా వెంకటాపురం నుంచి నడిపల్లి, గల్గం, రుద్రారం ప్రాంతాల్లోని 90 చదరపు కి.మీ పరిధిలోని కర్రెగుట్టలను బలగాలు జల్లెడపడుతున్నాయి. వేల సంఖ్యలో బలగాలు కొండలపైకి చేరుకుంటున్నాయి. మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న సొరంగాలను బలగాలు గుర్తించాయి. ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను, పెద్దఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. శనివారం భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయినట్లు వార్తలు వచ్చినా అధికారులు ధ్రువీకరించలేదు.
కర్రెగుట్టల అభయారణ్యంలో ఫార్వర్డ్ ఆపరేటింగ్ క్యాంపుల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మావోయిస్టుల కంచుకోట అబూజ్మడ్ను క్యాంపులు ఏర్పాటు చేసుకుని ధ్వంసం చేశారు. ఇదే ప్రణాళిక కర్రెగుట్టల్లో అమలు చేయనున్నారు. కర్రెగుట్టలకు అనుబంధంగా ఉన్న పామునూరు, తడపల, పెనుగోలు ప్రాంతాల్లోనూ బలగాలు క్యాంపులు ఏర్పాటు చేసుకుటున్నారు.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు