అక్రమంగా బంగారం తరలిస్తూ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డ నటి రన్యారావుకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నటి పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మరో నిందితుడు కొండూరు రాజు బెయిల్ పిటిషన్‌పై తీర్పును కర్ణాటక హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తాజాగా దాన్ని కొట్టివేసింది. కాఫిఫోసా చట్టం కింద నిందితులకు ఏడాది పాటు బెయిల్ లభించే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వరాదని డీఆర్ఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
దుబాయ్ నుంచి బంగారం తరలిస్తూ నటి రన్యారావు బెంగళూరు ఎయిర్‌పోర్టులో దొరికిపోయిన సంగతి తెలిసిందే. నటి రన్యారావు నుంచి 14.7 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఈ కేసులో రన్యారావు సహా ముగ్గురుని అరెస్ట్ చేశారు. బెదిరించి ఇరికించారని, తనకేమీ సంబంధం లేదని నటి రన్యారావు తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
నటి రన్యారావు గత కొన్నేళ్లుగా బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని అధికారులు కోర్టుకు విన్నవించారు. ఆభరణాల వ్యాపారి సాహిల్ జైన్‌ను ఈ కేసులో మూడో నిందితుడిగా పెట్టారు. అతడికి ఏప్రిల్ 7 వరకు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. జైన్ బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.