వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల్లో కొన్ని వేలానికి వచ్చాయి. బుట్టా కుటుంబం జీవిత బీమా అనుబంధ సంస్థ హెచ్ఎఫ్ఎల్ నుంచి 2018లో 310 కోట్లు రుణంగా తీసుకున్నారు. తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు. రూ.40 కోట్ల వరకు చెల్లించారు. నాలుగేళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో హెచ్ఎఫ్ఎల్ బుట్టా ఆస్తులను వేలానికి పెట్టింది. హెచ్ఎఫ్ఎల్ నుంచి తీసుకున్నరుణంతో బుట్టా రేణుక భర్త బుట్టా ఇన్ఫ్రా, మెరిడియన్ ఎడ్యుటెక్, బుట్టా కన్వెన్షన్ కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టారు. రుణం చెల్లించడంలో విఫలమయ్యారు. ప్రతి నెలా రూ.3.40 కోట్లు చెల్లించాల్సి ఉంది. వడ్డీ ఎక్కువగా ఉందని, చెల్లింపుల విధానం మార్చాలంటూ బుట్ట నీలకంఠ సూచనలను హెచ్ఎఫ్ఎల్ అంగీకరించలేదు. దీంతో బుట్టా కుటుంబానికి చెందిన రెండు ఆస్తులు వేలానికి వచ్చాయి.
బుట్టా కుటుంబానికి చెందిన జూబ్లీహిల్స్‌లోని 5 వేల గజాల స్థలం, మాదాపూర్‌లోని 7వేల గజాల్లోని కన్వెక్షన్ కేంద్రం గతంలోనే హెచ్ఎఫ్ఎల్ వేలానికి పెట్టింది. అయినా కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కొనుగోలు చేసిన తరవాత వివాదం చోటుచేసుకుంటుందని ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. రుణ వివాదం
ఎన్సీఎల్టీ పరిధిలో ఉంది.