పహల్గాం ఉగ్రదాడి తరవాత సైన్యం వేట కొనసాగిస్తోంది. ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్న వారి ఇళ్లను సైన్యం బాంబులతో పేల్చి వేస్తోంది. తాజాగా ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లను బాంబులతో పేల్చివేసింది. ఉగ్రమూలాలు పెకలించేందుకు సైనిక బలగాలు జమ్ము కాశ్మీర్లో గాలింపు ముమ్మరం చేశాయి.
షోపియాన్ సమీపంలోని చోటిపొరా గ్రామంలో లష్కరే తొయ్యబా కమాండర్ షాహిద్ అహ్మద్ ఇంటికి సైన్యం ఎల్ఈడీతో పేల్చివేశాయి. నాలుగేళ్లుగా ఉగ్ర సంబంధ కార్యకలాపాల్లో షాహిద్ పాల్గొంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కుల్గాంలో మరో ఉగ్రవాది జాహిద్ అహ్మద్ నివాసాన్ని సైనికులు కూల్చివేశారు. 2023 జూన్ నుంచి ఇతను జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు.
కాచిపొరాలో హరీస్ అహ్మద్ అనే ఉగ్రవాది ఇంటిని బాంబులతో కూల్చివేశారు. ఇతను లష్కరే తొయ్యబా ఉగ్రసంస్థ తరపున పనిచేస్తున్నాడు. వీరిపై ఇప్పటికే కేసులు నమోదై ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడితో సంబంధం ఉన్న ఆదిల్ హుస్సేన్, థకర్, ఆసిఫ్ షేక్ నివాసాలను ఇప్పటికే కూల్చి వేసిన సంగతి తెలిసిందే. వారి ఇళ్లకు బాంబులు అమర్చి సైనికులను చంపాలని చూశారని తేలింది. భద్రతా బలగాలకు ట్రాప్ చేసినట్లు గుర్తించారు.బలగాలు ముందుగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.
కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలసి పనిచేస్తున్న ఇద్దరి యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి పేర్లు వెల్లిడించలేదు. ఖెమోహ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు.