పాక్ జాతీయులను గుర్తించి వెంటనే పంపించి వేయాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. పలువురు సీఎంలకు నేరుగా అమిత్ షా ఫోన్ చేశారు. దేశంలోని పాక్ జాతీయులను గుర్తించి కేంద్రానికి సమాచారం అందించాలని, అప్పుడే వారి వీసా రద్దు చేయడం కుదురుతుందన్నారు. సార్క్ నిబంధనల మేరకు దేశంలోకి వచ్చిన పాక్ జాతీయులను కూడా గుర్తించి వెంటనే పంపించి వేయాలని కోరారు.
వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోన్న పాక్ జాతీయులకు ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చారు. పలు రాష్ట్రాలు పాక్ జాతీయులను గుర్తించి సమాచారం అందించాలని కేంద్రం కోరింది. పర్యాటకులుగా వచ్చిన వారు 48 గంటల్లో దేశం వీడి వెళ్లాలని ఆదేశించారు.
జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు బలిగొన్న తరవాత భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. సరిహద్దుల వెంట తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దేశ వ్యాప్తంగా ఉగ్ర వేట కొనసాగుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్నారు. పాకిస్థాన్ జాతీయులకు వీసాల జారీ నిలిపివేశారు.