విజయవాడలో ఉగ్ర కలకలం రేగింది. సిమి ఉగ్రవాద సంస్థకు సహకారం అందిస్తున్నారని నలుగురు సానుభూతి పరుల కోసం విజయవాడ పోలీసులు గొల్లపూడి, పాతబస్తీలో తనిఖీలు చేపట్టారు. నిఘా వర్గాల హెచ్చరికల మేరకు సిమి ఉగ్రమూలాలను కనుగొనేందుకు తనిఖీలు చేశారు. నలుగురు యువకులు సిమి ఉగ్రవాద సంస్థకు పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
కేంద్ర నిఘా సంస్థల నుంచి అందిన హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. సిమి ఉగ్రవాదులకు సాయం అందిస్తున్న ముఠాలపై నిఘా పెట్టారు. నలుగురు యువకులు సిమి ఉగ్ర సంస్థకు పనిచేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో చిట్టినగర్, గొల్లపూడి, పాతబస్తీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.