జమ్ము కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత సైన్యం రంగంలోకి దిగింది. అనుమానిత ఉగ్రవాదుల ఇళ్లను పేల్చి వేస్తోంది. లష్కర్ ఏ తొయ్యబా ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాది ఇంటిని పేల్చి వేశారు. జమ్ముకశ్మీర్ త్రాల్ ప్రాంతంలోని ఆసిఫ్ షేక్ ఆలియాస్ ఆసిఫ్ ఫౌజీ ఇళ్లును ఐఈడీతో పేల్చి వేసినట్లు భారత ఆర్మీ తెలిపింది. ముగ్గురు లష్కర్ ఏ తొయ్యబా ఉగ్రవాదుల్లో ఒకరిగా భావిస్తున్నఆసిఫ్ షేక్ ఇంటిని పేల్చివేశారు. జమ్ము కాశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది.
ఉగ్రదాడి తరవాత భారత్ పాక్పై ముప్పేట దాడికి దిగింది. ఓ వైపు కఠిన ఆంక్షలు అమలు చేస్తూనే సర్జికల్ స్ట్రయిక్స్ చేసేందుకు సిద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలతోపాటు, సుఖోయ్ 30 విమానాలకు సరిహద్దు విమానాశ్రయాలకు తరలించినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న భారత్, పాకిస్థానీయులకు వీసా సేవలు నిలిపివేసింది. వాఘా, అటారీ సరిహద్దుల వద్ద ఇవాళ గేట్లు తెరుచుకోలేదు.