మాజీ క్రికెటర్ టీం ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు వచ్చాయి. ఐ కిల్ యూ అంటూ ఈ మెయిల్ బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐసిస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు మెయిల్ ద్వారా తెలుస్తోంది. సైబర్ నిపుణులు మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. జమ్ము కశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి గంభీర్ సంతాపం తెలిపారు. దాడికి పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని గంభీర్ హెచ్చరించారు.