కశ్మీర్ ఉగ్రదాడుల నేపధ్యంలో నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో విజిలెన్స్, ఇంటర్వెన్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. రెండో ఘాట్ రోడ్డులో 300 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయనే హెచ్చరికల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. తిరుమల కొండపైకి వెళుతోన్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
రద్దీ ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కశ్మీర్ లోయలో 58 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. రద్దీ ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, పర్యాటక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశంలో మరికొన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.