వైసీపీ మాజీ మంత్రి విడదల రజని మరిది గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిలకలూరిపేట సమీపంలోని ఓ కంకర క్వారీ యజమానిని బెదిరించి రూ. 2.2 కోట్లు వసూలు చేశారనే అభియోగాలపై పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో గోపిని అరెస్ట్ చేశారు. గోపిని విజయవాడకు తరలిస్తున్నారు. కంకర క్వారీ యజమానులపై ఫిర్యాదులు చేసి, అధికారులతో తనిఖీలు చేయించి, సీజ్ చేయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారంటూ చిలకలూరిపేట పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గోపిని అదుపులోకి తీసుకున్నారు.