జమ్ము కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి పాక్ సహకారంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ షేక్ అసీం మునీర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.2000 సంవత్సరంలో జరిగిన ఛత్తీసింగ్‌పొర నరమేధానికి పోలికలు కనిపిస్తున్నాయి. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ షేక్ అసీం మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా ఉగ్రదాడికి కారణంగా అనుమానిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఓవర్సీస్ పాకిస్థాన్ కన్వెన్షన్‌లో పాక్ ఆర్మీ ఛీప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జమ్ము కశ్మీర్ గతంలో, ప్రస్తుతం మన జీవనాడి. మనం ఎప్పటికీ మరచిపోలేం. మన కశ్మీర్ సోదరులను పోరాటంలో ఒంటరిగా వదిలివేయలేం. మీ పిల్లలకు పాకిస్థాన్ కథ చెప్పండి. మనం హిందువులకంటే భిన్నమని, మన పూర్వీకుల ఆలోచనలను పిల్లలకు చెప్పండి.మన మతాలు, ఆచారాలు, వ్యవహారాలు, ఆకాంక్షలు, ఆలోచనలు భిన్నంగా ఉంటాయి కాబట్టి రెండు దేశాల సిద్దాంతానికి పునాది పడిందని మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి భారత్‌పై తీవ్ర శత్రుభావంతో వ్యవహించే మునీర్ చేసిన వ్యాఖ్యల తరవాత దాడులు జరగడం అనుమానాలను మరింత పెంచుతోంది. ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేయడంతోపాటు, వారికి శిక్షణ ఇచ్చి సరిహద్దులుదాటించడంలో పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్ఐ పాత్ర ఉందనేని భారత నిఘా వర్గాల సమాచారం.
ఉగ్రదాడికి ముందే పాక్ వాయుసేన విమానాలను కరాచీ నుంచి లాహోర్, రావల్పిండి తరలించడం కూడా అనుమానాలకు తావిస్తోంది. 2019 పుల్వామాలో సైనికులపై దాడి జరిగిన సమయంలో మునీర్ ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పాక్ ఆర్మీ అధిపతిగా ఉన్నారు. ఆయన ఆలోచనలు ఉగ్రవాదులను భారత్‌పై రెచ్చగొట్టేవిగా ఉన్నాయి.
నిషేధిత లష్కర్ ఏ తొయ్యబా సంస్థ సైపుల్లా ఆలియాస్ ఖలీద్ తాజా దాడికి వ్యూహకర్తగా అనుమానిస్తున్నారు. వీరికీ జమ్ము కాశ్మీర్లో ఇద్దరు సహకరించినట్లు తెలుస్తోంది. లష్కర్ ఏ తొయ్యబా సంస్థ కనుసన్నల్లో టీఆర్ఎఫ్ దాడులకు దిగిందనేని సుస్పష్టం. మారణహోమం మొత్తాన్ని బాడీ కెమెరాల్లో చిత్రీకరిచడం చూస్తుంటే పాక్ సహకారం లేకుండా ఇది సాధ్యం కాదనేది నిజం.
భారత ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండటం, అమెరికా ఉపాధ్యక్షుడు భారత్ పర్యటనలో ఉన్న సమయంలో ఉగ్రదాడి జరగడం అంటే, ప్రపంచ దృష్టిని కశ్మీర్ సమస్యపైకి తీసుకు వచ్చేలా చేయడమే పాక్ ఉద్దేశంగా తెలుస్తోంది. జమ్ము కశ్మీర్ తమదేననే చెప్పేందుకే పాకిస్థాన్ ఇలా అంతర్జాతీయ ప్రముఖులు భారత్ పర్యటనలో ఉన్నప్పుడే ఉగ్రవాదులను ఎగేస్తుందనేని వాస్తవం. గతంలోనూ ఇలాంటి చర్యలకు పాక్ పాల్పడింది. ఉగ్రదాడిని ఖండించకుండా తమకు సంబంధం లేదంటూ పాక్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే దాడికి పాల్పడింది ఎవరనేది అర్థం చేసుకోవచ్చు.