జమ్ము కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి తరవాత భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసారు. వారంలో దేశం వీడాలని ఆదేశించారు. బుధవారం అత్యవసరంగా సమావేశమైన భద్రతా క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అటారీ సరిహద్దు మూసివేయాలని నిర్ణయించారు. దేశంలోని పాక్ పౌరులు వెంటనే దేశం వీడి వెళ్లాలని ఆదేశించారు.
పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. బుధవారం అర్థరాత్రి ఆయన్ను ఢిల్లీలోని విదేశాంగశాఖ కార్యాలయానికి పిలిపించి పర్సోనా నాన్ గ్రాటా అంటే అయిష్టమై వ్యక్తులుగా పేర్కొంటూ నోటీసులు అందించారు. దీని ప్రకారం వారు వారం రోజల్లో దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది.