పహల్గామ్ దాడిలో మృతుల కన్నీటి గాధలు కనీస మానవత్వం ఉన్నవారి ప్రతీ ఒక్కరినీ కదిలించి వేస్తున్నాయి. పెళ్ళయి పది రోజులు కూడా కాని నవ వధువు తన భర్త శవం దగ్గర నిస్సహాయంగా కూలబడిన దృశ్యాన్ని చూసి కంట తడి పెట్టని వాడే లేడు. కొందరు మానసిక ఉన్మాదులైన, పాకిస్తాన్ ప్రేమికులైన ముస్లిములు తప్ప ఆ దుశ్చర్యతో దిగ్భ్రాంతి చెందని భారతీయుడు లేనే లేడు. పేరుపేరునా ప్రశ్నించి, హిందువులు అని నిర్ధారించుకుని చంపిన ఘాతుకాన్ని మతోన్మాదం అనక ఇంకేమంటారు?
పహల్గామ్లో ఉగ్రవాదుల తూటాలకు బలైపోయిన వారిలో అతుల్ మోనే ఒకరు. అతుల్ సహా పలువురిని కాల్చి చంపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఆయన బంధువులు కోరుకుంటున్నారు. అతుల్ మోనే బంధువు రాహుల్ అకుల్ ఇలా చెప్పారు. ‘‘అక్కడ పటిష్ఠ భద్రత ఉండాలి. మా వాళ్ళు మూడు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది వెళ్ళారు. నేను అతుల్ మోనే భార్యతో మాట్లాడాను. ఉగ్రవాదులు ముందు ఆయనను హిందువేనా అని అడిగారట. అవును అని చెప్పిన వెంటనే తన కళ్ళ ముందే ఆయనను కాల్చి చంపేసారట. అలా ఆ మూడు కుటుంబాలకూ ఆధారమైన మగవారిని కాల్చి చంపేసారు. ఆ దోషుల మీద వీలైనంత త్వరగా కఠినమైన చర్యలు తీసుకోవాలి’’ అంటూ కన్నీళ్ళ పర్యంతమయ్యారు.
అతుల్ మోనే వదిన రాజశ్రీ అకుల్ తన ఆవేదనను ఇలా తెలియజేసారు. ‘‘నా కళ్ళు ఎండిపోయాయి. ఇంక నీళ్ళు రావడం లేదు. అతుల్‌ను కాల్చి చంపేసారని తెలిసాక మా పరిస్థితి దారుణంగా ఉంది. అతని కడుపులో కాల్చేసారట. ఆ ఉగ్రవాదులను ఏ ఆలస్యం లేకుండా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’.
ఏప్రిల్ 22 మంగళవారం పహల్గామ్లోని బైసరన్ లోయ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో పలువురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే తీవ్ర గాయాల పాలైన వారికి రూ.2లక్షలు పరిహారం ప్రకటించారు. ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఉదయం పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఎన్ఐఏ బృందం రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది.