జమ్ము కశ్మీర్ పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హూసబలే తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దేశ ఐక్యత, సమగ్రతలపై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు విభేదాలకు అతీతంగా దాడిని ఖండించాలని కోరారు. బాధితులకు, వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే డిమాండ్ చేశారు.