జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తరవాత సైన్యం ముష్కరుల వేట మొదలు పెట్టింది. బుధవారం సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం కాల్చి చంపింది. ఉరి నాలా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటనా ప్రదేశంలో భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఆయుధాలు లభ్యం అయ్యాయి. ఢిల్లీ నుంచి నిఘా వర్గాలు శ్రీనగర్ చేరుకొన్నాయి. వీరిలో బీఎస్‌ఎఫ్ అధికారులు ఉన్నారు. అనంతనాగ్ జిల్లాలోని మెడికల్ కాలేజికి భద్రత పెంచారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జమ్ము కశ్మీర్ అంతగా హై అలర్ట్ ప్రకటించారు. నేడు బాధితులను హోం మంత్రి అమిత్ షా పరామర్శించనున్నారు.
ఉగ్రదాడి సమయంలో ఓ వ్యక్తి ఫోటో వైరల్ అయింది. లాల్చీ ఫైజమా ధరించి, చేతిలో రైఫిల్‌తో పరుగులు తీస్తున్నారు. అతన్ని ఉగ్రవాదిలా అనుమానిస్తున్నారు. అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.