ఉగ్రమూకల దాడిలో విశాఖ నగరానికి చెందిన బ్యాంకు మాజీ ఉద్యోగి చంద్రమౌళి చనిపోయారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన సమయంలో చంద్రమౌళి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఉగ్రవాదులు చంద్రమౌళిని వెంటాడి మరీ చంపినట్లు సహచర పర్యాటకులు చెబుతున్నారు. వదిలేయాలని వేడుకున్నా ముష్కరులు వెంటాడి మరీ చంపినట్లు తెలుస్తోంది.
పహల్గాం దాడి తరవాత చంద్రమౌళి సహచరులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. విశాఖలోని ఆయన కుటుంబ సభ్యులు సమాచారం అందగానే పహల్గాం బయలుదేరి వెళ్లారు.