జమ్ముకశ్మీర్ పహల్గాంలో ఉగ్రమూకల దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీ పర్యటనలో ఉన్న ప్రధానికి దాడి విషయం తెలియగానే హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పర్యాటకులపై దాడిని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. దాడిలో పాల్గొన్న వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించింది. నేరస్థులపై అత్యంత కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఘటన గురించి హో మంత్రి అమిత్ షా ప్రధానికి వివరించారు. అధికారులతో హోం మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యవసర భద్రతా సమీక్ష కోసం శ్రీనగర్ వెళుతున్నట్లు హోంమంత్రి అమిత్ షా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
పహల్గాంలో పర్యాటకులపై దాడి అత్యంత హేయమైన చర్య అని సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడినవారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదన్నారు.