నిఘా వర్గాల హెచ్చరికలు నిజమయ్యాయి. జమ్ము కశ్మీర్లో 30 మంది ఉగ్రవాదులు ఒకేసారి విరుచుకుపడ్డారు. జమ్ము కశ్మీర్లో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం పహల్గావ్లో ఉగ్ర మూకలు రెచ్చిపోయాయి. విచక్షణా రహితంగా పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. పాకిస్థాన్ నుంచి జమ్ము కశ్మీర్లో సైనికుల దుస్తుల్లో చొరబడ్డ సైనికులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 27 మందిని పొట్టనబెట్టుకున్నారు. పదుల సంఖ్యలో పర్యాటకులు గాయపడ్డారు. గాయపడిన వారిని సైన్యం హెలికాఫ్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలించింది. పెద్ద సంఖ్యలో సైన్యం రంగంలోకి దిగింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హుటాహుటిన పహల్ గావ్ బయలు దేరి వెళ్లారు. జమ్ము కశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ కూడా ఘటనా స్థలానికి బయలు దేరారు. ఇటీవల కాలంలో ఉగ్రమూకలు ఈ విధంగా రెచ్చిపోవడం ఇదే మొదటి సారి. మృతుల్లో విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఆర్మీ రంగంలోకి దిగి ఉగ్రమూకల కోసం జల్లెడ పడుతోంది.