పసిడి ధర పరుగులు పెడుతోంది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఒకే రోజు రూ.3 వేలు పెరిగి 101350 వద్ద ట్రేడవుతోంది. గడచిన వారం రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.6 వేలకుపైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర జీవిత కాల రికార్డు స్థాయికి ఎగబాకింది. 31 గ్రాముల ఔన్సు స్వచ్ఛమైన బంగారం ధర 3496 డాలర్లకు ఎగబాకింది. ఏడాది చివరి నాటికి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర లక్షా 25 వేలకు చేరే అవకాశముందని అంతర్జాతీయ సంస్థ గోల్డ్మన్ శాక్స్ వెల్లడించింది. బంగారం ధరతోపాటు వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి లక్షా 11 వేలను దాటింది. దేశీయంగా వెండి ధర 101150 వద్ద ట్రేడవుతోంది.
బంగారం ధర ఈ ఏడాది ఇప్పటికే 22 శాతం పెరిగింది. స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులతో పెట్టుబడిదారులు విలువైన మెటల్స్ బంగారం, వెండి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.దీంతో పసిడి ధర పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు రావడం కూడా బంగారం ధర పెరగడానికి దారి తీస్తున్నాయి. బంగారంలో (goldrate) పెట్టుబడులపై భారీగా రాబడులు రావడంతో చాలా మంది ఇన్వెస్టర్లు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.