సివిల్ సర్వీసు పరీక్షల తుది ఫలితాలు విడుదల అయ్యాయి. సివిల్స్ 2024 ఫలితాలను యూపీఎస్సీ కాసేపటి కిందట విడుదల చేసింది. ఈ తుది ఫలితాల్లో తెలుగు విద్యార్ధులు సత్తా చాటారు. తుది ఫలితాల్లో శక్తి దుబే మొదటి ర్యాంకు సాధించారు. హర్షిత గోయల్ 2, అర్చిత్ ఫరాగ్ 3, షా మార్గి చిరాగ్ 4, ఆకాశ్ గార్గ్ 5, కోమల్ పునియా 6, ఆయుషీ బన్సల్ 7, రాజ్ కృష్ణ ఝా 8, ఆదిత్య విక్రమ్ అగర్వాల్ 9, మయాంక్ త్రిపాఠి 10 ర్యాంకులు సాధించారు.
సివిల్స్ తుది ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మెరిశారు. ఇ.సాయి శివాని 11వ ర్యాంకు, బన్నా వెంకటేశ్ 15వ ర్యాంకు, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్ కుమార్ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్ 68, చేతనరెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119, చల్లా పవన్ కల్యాణ్ 146, శ్రీకాంత్ రెడ్డి 151, సాయితేజ 154, కొలిపాక శ్రీకృష్ణసాయి 190వ ర్యాంకులు సాధించారు.
కేంద్ర శాఖల్లోని 1056 పోస్టుల భర్తీకి గత ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేశారు.
జూన్ 16న ప్రిలిమ్స్, సెప్టెంబరు 20 నుంచి 29 వరకు మెయిన్స్ నిర్వహించారు. జనవరి నుంచి ఏప్రిల్ 17 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 1009మందిని ఎంపిక చేశారు. జనరల్ కేటగిరీలో 335 మంది, వెనుకబడిన వర్గాల నుంచి 109, ఓబీసీ 318, ఎస్సీ 160, ఎస్టీ 87 మంది ఉన్నారు.