మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆ కుంభకోణంలో తన పాత్ర విజిల్ బ్లోయర్లాందన్నారు. తప్పించుకునేందుకే దొంగలు దొరికారంటూ…రాజ్ కసిరెడ్డిని ఉద్దేశించి ఎక్స్‌లో పోస్ట్ చేసారు. దొరకని దొంగలు నా పేరులాగుతున్నారని వ్యాఖ్యానించారు. దొరకని దొంగలు ఎవరనేది తేలాల్సి ఉంది.
మద్యం కుంభకోణంలో ఒక్క రూపాయి కూడా నేను ముట్టలేదని విజయసాయిరెడ్డి చెప్పారు. దొంగల మిగతా దుస్తులు విప్పేందుకు కూడా సహకరిస్తానన్నారు. మద్యం కుంభకోణంలో సూత్రధారి, పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డేనని సిట్ విచారణ తరవాత విజయసాయిరెడ్డి మీడియాతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించాడని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు భవిష్యత్తులో చెబుతానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
సోమవారం రాత్రి హైదరాబాద్ విమానాశ్రయంలో రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి విజయవాడ తరలించిన సంగతి తెలిసిందే. సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డిని సుధీర్ఘంగా విచారించారు. రాజ్ కసిరెడ్డి అరెస్టు, విచారణ నేపథ్యంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.