టాలీవుడ్ ప్రముఖనటుడు మహేశ్‌బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సాయి సూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు కేసుల్లో నటుడు మహేశ్‌బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ రెండు నిర్మాణ సంస్థలు కొనుగోలు దారులను మోసం చేయడంతో కేసులు నమోదయ్యాయి.
ఈ రెండు గ్రూపులకు మహేశ్‌బాబు ప్రచారకర్తగా వ్యవహరించారు. పెట్టుబడులు పెట్టాలంటూ ప్రజలను ప్రభావితం చేశారని అభియోగాలు నమోదు అయ్యాయి. దీనిపై విచారించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయా సంస్థలు మహేశ్‌బాబుకు ఇచ్చిన పారితోషికంపై కూడ ఈడీ ఆరా తీస్తోంది.