నటి జెత్వానీకి వేధింపుల కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో పీఎస్ఆర్ ఆంజనేయులును ఆయన ఇంట్లో అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్నారు. వైసీపీ పాలనలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ అధిపతిగా పనిచేశారు. ఆ సమయంలో పెద్దల ఆదేశాల మేరకు నటి జెత్వానీని అరెస్ట్ చేసి ముంబై నుంచి రహస్యంగా విజయవాడ తరలించిన కేసును సిఐడి విచారిస్తోంది.
జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వారిలో సీతారామాంజనేయులు ప్రధానంగా ఉన్నారు. మరో ఐపీఎస్ విశాల్ గున్నీ సహా మరో ఐపీఎస్పై జెత్వానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సిఐడి అధికారులు విచారణ చేస్తున్నారు.వైసీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పీఎస్ఆర్ ఆంజనేయులు అంత్యం సన్నిహితంగా మెలిగారు