కేథలిక్ల మత గురువు పోప్ ప్రాన్సిస్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన శ్వాసకోశ, డబుల్ న్యుమోనియా, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. ఫిబ్రవరి 14 నుంచి ఆయన 38 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. పోప్ ప్రాన్సిస్ మృతిని వాటికన్ వర్గాలు ధ్రువీకరించాయి. 2013లో పోప్ బెనడిక్ట్ తరవాత ఫ్రాన్సిస్ బాధ్యతలు చేపట్టారు.
1938లో ఫ్రాన్సిస్ అర్జెంటీనాలో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి ఈ పదవి అందుకున్న తొలి వ్యక్తి ఆయనే కావడం గమనార్హం.2016లో రోమ్ వెలుపల ఇతర మతాలకు చెందిన శరణార్థుల పాదాలు కడిగి వార్తల్లో నిలిచారు. అప్పుడప్పుడు సామాజిక అంశాలు కూడా మాట్లాడుతూ ఉంటారు.
పోప్ ఫ్రాన్సిస్ మరణానికి కొన్నిగంటల ముందు ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు సందేశం ఇచ్చారు. వాటికన్ నగరంలో పీటరస్ స్క్వేర్లో 35 వేల మందిని ఉద్దేశించి ప్రసంగించారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యాపీ ఈస్టర్ అంటూ చెప్పారు. తన సందేశాన్ని ఆర్చి బిషప్ డియాగో రావెలి చదివి వినిపించారు.ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.