అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసిన రూ.500 దొంగనోట్లు చలామణిలోకి వచ్చినట్లు కేంద్ర హోం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దొంగనోట్ల విషయంపై సీబీఐ, ఎన్ఐఏ, సెబీ,ఎఫ్ఐయూ,డీఆర్ఐలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది. సెబీకి కూడా వివరాలు పంపింది. దొంగనోట్ల ప్రింటింగ్, నాణ్యత విషయంలో చాలా వరకు అసలు నోట్లను పోలి ఉన్నాయని హోం శాఖ తెలిపింది.
దొంగనోట్లలో స్పెల్లింగ్ తప్పు ఉందని గుర్తించారు. RESERVE BANK ON INDIA అనే పదంలో RESERVE పదంలో ఈ బదులు ఏ పడినట్లు గుర్తించారు. తప్పులను క్షుణ్ణంగా గుర్తించాల్సి ఉందన్నారు. నకిలీ నోట్లు చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఏజన్సీలు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరికలు జారీ చేశారు. మార్కెట్లో ఇప్పటికే చాలా నోట్లు చలామణిలో ఉన్నాయని, ఎన్ని ఉన్నాయనేది చెప్పలేమన్నారు.