వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంటు కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించి కాంట్రాక్టులు, కమిషన్లు పొందారంటూ ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనంపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంలో తన తప్పు ఉందని తేలితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పారు. సిమెంటు పరిశ్రమ యాజమాన్యం వైసీపీ నాయకులకు వంతపాడుతోందన్నారు. స్థానికులకు ఏ మాత్రం ఉపాధి ఇవ్వడం లేదని ఆరోపించారు. కర్మాగారం యాజమాన్యం తీరుపై సీఎం చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
సిమెంటు పరిశ్రమ యాజమాన్యంపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బెదిరింపులకు దిగుతున్నారంటూ ప్రముఖ పత్రికలో కథనాలు రావడంతో ఆయన స్పందించారు. పరిశ్రమకు అవసరమైన ముడిసరకు సరఫరా, పరిశ్రమలో ఉత్పత్తి అయిన సిమెంటు రవాణా కాంట్రాక్టులు తమ వారికే ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే కొన్ని కాంట్రాక్టులు ఇచ్చినా, ఇంకా కావాలంటూ డిమాండ్ చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం