క్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బీజేపీ నేత, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. విజయవాడలో సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ ఆసుపత్రి, రీసెర్చ్ కేంద్రానికి ఆమె శంకుస్థాపన చేశారు. పామర్లు నియోజకవర్గంలోని ముళ్లపూడిలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించనున్నారు. నా తల్లి బసవతారకం క్యాన్సర్ వ్యాధి భారినపడి 1984లో మృతి చెందారని, ఆమె బాధను మేం ప్రత్యక్షంగా చూశానని ఆమె గుర్తుచేసుకున్నారు. తన తల్లి క్యాన్సర్‌తో పోరాటం చేసి చనిపోయినట్లు చెప్పారు.
దేశంలో క్యాన్సర్ కేసులు ఏటా పెరుగుతున్నాయని పురందేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా 15 లక్షల మంది క్యాన్సర్ భారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగతాగడం, గుట్కాలు నమలడం వల్ల బాధితుల సంఖ్య ఏటా పెరుగుతోంది. వీటిని నిషేధించలేకపోతున్నామని ఆమె అన్నారు.
క్యాన్సర్ వైద్యానికి అయ్యే ఖర్చులు భరించలేక చాలా మంది పేదరికంలోకి జారిపోతున్నారని పురందేశ్వరి చెప్పారు. కాన్సర్ వైద్యం పెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితమైందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు పెరగాలన్నారు. క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తించేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తోందన్నారు.
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం