గూఢచర్యం కేసులో పాక్ జైల్లో మగ్గుతోన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషన్ జాదవ్‌పై పాక్ తన అభిప్రాయం వెల్లడించింది. 2019 అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పాక్ ఉటంకిస్తోంది. కుల్భూషన్ జాదవ్‌కు అప్పీల్ చేసుకునే హక్కు లేదని పాకిస్థాన్ గుర్తుచేస్తోంది. 2018 జూన్‌లో ఐసీజే భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తూనే జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ హక్కు కల్పించాలని చెప్పింది. అతడిని విధించిన మరణశిక్షపై పునరాలోచన చేయాలని పాకిస్థాన్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం కోరింది.
2023 మేలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు సమయంలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై సైనిక కోర్టులు దోషులుగా నిర్థారించాయి. దీన్ని సవాలు చేస్తూ పాకిస్థాన్ సుప్రీంకోర్టులో దాఖలైన కేసుపై విచారణ జరిగింది. ఈ సమయంలో జాదవ్ కేసు ప్రస్తావనకు వచ్చింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటోన్న జాదవ్ కు ఉన్న అప్పీలు హక్కు, పాక్ ఆందోళనకారులకు లేదా అని న్యాయవాది వాదనలు వినిపించారు.
న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించిన అంతర్జాతీయ న్యాయస్థానం కుల్భూషన్ జాదవ్‌కు కాన్సులర్‌తో మాట్లాడేందుకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చినట్లు గుర్తుచేశారు. తీర్పు తరువాత వియన్నా ఒప్పందానికి అనుకూలంగా చట్టాల్లో సవరణలు చేసినట్లు న్యాయమూర్తి చెప్పారు. పున:సమీక్షకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం