మాజీ ప్రధాని హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. 12 మందిని తమ దేశానికి తీసుకొచ్చేందుకు బంగ్లాదేశ్ ఇంటర్‌పోల్ సాయం కోరింది. వారి కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను బంగ్లాదేశ్ నేషనల్ సెంట్రల్ బ్యూరో కోరింది. 77 ఏళ్ల హసీనా పదవీచ్చుతురాలయ్యాక భారత్‌లో తలదాచుకుంటోందని ఇంటర్‌పోల్‌కు సమాచారం అందించారు.
గత ఏడాది ఆగష్టు 5 నుంచి హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నట్లు బంగ్లాదేశ్ నేషనల్ సెంట్రల్ బ్యూరో వెల్లడించింది. కోర్టుల్లో అప్పీళ్లు, దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా ఈ వివరాలు అందించినట్లు సహాయ ఐజీ ఇనాముల్ హక్ సాగొర్ వెల్లడించారు.
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం