ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఆయన జమ్ము కశ్మీర్ నుంచి ఢిల్లీకి విమానంలో బయలు దేరారు. అయితే ఆ విమానం ఢిల్లీకి బదులు జైపూర్ వెళ్లింది. అక్కడ నుంచి ఎప్పుడు ఢిల్లీకి బయలు దేరుతుందో కూడా తెలియడం లేదని సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఢిల్లీ విమానాశ్రయ అధికారులు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఆయన అసహనానికి గురయ్యారు. వీరి అలసత్వంతో సహనం కోల్పోతున్నామన్నారు. మర్యదగా మాట్లాడే పరిస్థితుల్లో లేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతికూల వాతావరణం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో ఆరు విమానాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలు రద్దు చేయగా మరికొన్ని గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి.
కనెక్టింగ్ విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. భారీ వర్షాలు, వడగండ్ల వర్షం విరుచుకుపడటంతో విమానాలు రద్దు చేశారు. వాతావరణం అనుకూలించగానే విమానాల రాకపోకలు పునరుద్దరిస్తామని అధికారులు ప్రకటించారు.
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం