ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యా మంత్రి నారా లోకేశ్‌పై అసభ్య పోస్టులు పెట్టిన నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శ్రీరెడ్డి విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. 2024 నవంబరు 13న నెల్లిమర్ల, అనకాపల్లి పోలీస్ స్టేషన్లలో శ్రీరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఆమె శనివారం హాజరయ్యారు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో శ్రీరెడ్డిని పూసపాటిరేగ పోలీసులు విచారించారు. అవసరమైతే మరలా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని శ్రీరెడ్డికి పోలీసులు తెలిపారు.
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం