ఆగివున్న విమానాన్ని టెంపో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటన బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. శనివారంనాడు ఈ ఘటన జరిగింది. ప్రమాదం విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో డ్రైవర్ మాత్రమే ఉన్నారు. ఎవరికీ గాయలు కాలేదని అధికారులు తెలిపారు. ఆకాశ్ ఎయిర్ సిబ్బందిని కార్యాలయం నుంచి ఎయిర్‌క్రాఫ్ట్ బే వద్దకు తెచ్చేందుకు టెంపోను ఉపయోగించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం తరవాత విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. తరవాత వాటిని పునరుద్దరించారు.
బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ప్రమాదంపై ఇండిగో సంస్థ అధికారులు స్పందించారు. టెంపో ఢీకొట్టడం గురించి తమకు సమాచారం లేదన్నారు. జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు ఇదే విషయం చెప్పినట్లు ఇండిగో అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణీకుల భద్రత, వారి సౌకర్యాలు తమకు మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని ఇండిగో అధికారులు తెలిపారు.
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం