మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 16347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి విద్యా మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంతో కాలంగా నిరుద్యోగులు ఎదురు చూస్తోన్న కల సాకారమైంది. మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మెగా డీఎస్సీ ద్వారా జిల్లా స్థాయిలో 14088 ఉపాధ్యాయ పోస్టులు, జోనల్ స్థాయిలో 2259, ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్, సంక్షేమ శాఖలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. బధిర, అంధుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన, సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట్ర, జోనల్ స్థాయిలో భర్తీ చేస్తారు.
ఎస్జీటీ 6599, స్కూల్ అసిస్టెంట్లు 7487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 2 మొత్తం 14088 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. రాష్ట్ర స్థాయి 259, జోన్ 1 లో 400, జోన్ 2లో 348, జోన్ 3లో 570, జోన్ 4లో 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలిక పాఠశాలల్లో మొత్తం 13192 ఖాళీలు భర్తీ చేయనున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881, జువెనైల్ పాఠశాలల్లో 15, బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకు పేపర్ 1, ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 50 మార్కులు వస్తే అర్హత సాధించనట్లవుతుంది. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్ 2 మార్కులు లెక్కిస్తారు. ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. వీరికి టెట్ వెయిటేజీ 20 శాతం ఉంటుంది.
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం