అయోధ్య రామయ్య దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల దర్శనం, రాకపోకలు సులభతరం చేసేందుకు ఆలయం కింద 80 మీటర్ల పొడవైన సొరంగాన్ని సిద్దం చేశారు. ప్రదక్షిణ చేసుకునే భక్తులు, ఆలయానికి వచ్చే వారి మధ్య ఇబ్బందులు తలెత్తకుండా ఆలయానికి తూర్పు భాగంలో భూగర్భంలో 80 మీటర్ల సొరంగాన్ని నిర్మించారు. ఈ సొరంగం ద్వారా ప్రతి రోజూ లక్షన్నర మంది భక్తులు ఆలయ ప్రదక్షిణ చేయవచ్చు.
దేశంలో ఆలయ ప్రదక్షిణ కోసం నిర్మించిన అతి పెద్ద సొరంగం ఇదే కావడం గమనార్హం. భక్తుల రద్దీని తగ్గించేందుకు ఎల్ అండ్ టీ సంస్థ ఈ సొరంగాన్ని నిర్మించింది. ఆలయంలో ప్రవేశించే వారికి, ప్రదక్షిణలు చేసే వారి మధ్య రద్దీని తగ్గిస్తుందని ఎల్ అండ్ టీ మేనేజర్ వినోద్ మొహతా తెలిపారు. ప్రదక్షిణల కోసం 800 మీటర్ల పొడవైన గోడ నిర్మించే ప్రాజెక్టులో భాగంగా సొరంగ మార్గం నిర్మించారు. మరో నాలుగు మాసాల్లో సొరంగం పనులు పూర్తి చేయనున్నారు.
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం