తిరుమల గోశాలలో గత ప్రభుత్వ హయాంలో డైరెక్టర్గా పనిచేసిన హరినాథరెడ్డి మీద కచ్చితంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. వైఎస్సార్సీపీ పాలనాకాలంలో తిరుమల గోశాలలో గడ్డిలో కూడా అక్రమాలు చేసారని మండిపడ్డారు. గోశాలలోని ఆవులను ఒంగోలు తరలించి అక్కడ అమ్మేసుకుని కమిషన్లు కొట్టేసారని ఆరోపించారు. మాజీ డైరెక్టర్ హరినాథ రెడ్డి తన అక్రమాలు బైటపడకూడదనే ఉద్దేశంతో రికార్డులు ఎత్తుకుపోయారని విమర్శించారు. గోశాలలో అక్రమాల మీద నలుగురు సభ్యులతో కమిటీ వేస్తామని, ఆ కమిటీయే నిజానిజాలు తేలుస్తుందనీ బీఆర్ నాయుడు చెప్పారు.