అమెరికా పౌరులు కొంతకాలం బంగ్లాదేశ్‌కు పర్యటనకు వెళ్ళకపోవడమే మంచిదంటూ ఆ దేశం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. సుమారు ఏడాది నుంచీ బంగ్లాదేశ్‌లో అశాంతి నెలకొని ఉందని, నేరాలూ ఉగ్రవాద చర్యలూ బాగా పెరిగిపోయాయనీ అమెరికా తమ ప్రజలకు వెల్లడించింది. బంగ్లాదేశ్‌ను లెవెల్ త్రీ దేశంగానూ, ఆ దేశంలోని కొన్ని ప్రాంతాలను లెవెల్ ఫోర్‌గానూ పరిగణిస్తున్నామని అమెరికా ప్రకటించింది. నేరాలు, దోపిడీలు, తీవ్రవాదం, భద్రతా సమస్యలు ఎక్కువగా ఉన్నందున ఆ దేశానికి వెళ్ళకపోవడమే మంచిదని తమ దేశ ప్రయాణికులకు సూచించింది.
అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్‌లో కుట్రను ప్రోత్సహించి, షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూలేలా చేసింది. బైడెన్ సర్కారు అండతో మొహమ్మద్ యూనుస్ బంగ్లాదేశ్ పాలనా పగ్గాలను అందుకున్నాడు. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. ఆ నేపథ్యంలో బంగ్లాదేశ్ వెళ్ళవద్దంటూ తమ ప్రజలకు ఆ దేశం సూచించింది.