అఫ్గానిస్థాన్ తజికిస్థాన్ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 5.8గా నమోదైంది. అఫ్టానిస్థాన్ సరిహద్దుకు 86 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
అఫ్గానిస్తాన్ భూకంపం ప్రభావం దేశ రాజధాని ఢిల్లీలోనూ చూపింది. ఢిల్లీ, జమ్ముకశ్మీర్ సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.