విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై కూటమి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇవాళ ఉదయం 11 గంటలకు కలెక్టర్ హరేంధిరప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని ఒక్కసారిగా వీడటంతో కూటమి బలం పెరిగింది. జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యులు ఉన్నారు. సమావేశానికి ఎక్స్‌అఫీషియోలతో కలసి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. వీరంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు. ఈ సమావేశాన్ని వైసీపీ సభ్యులు కొందరు బహిష్కరించారు. అత్యధిక సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడంతో మేయర్ వెంకట కుమారి పదవి కోల్పోయారు.
మేయర్‌పై అవిశ్వాసం నెగ్గడంతో కూటమి నేతలు సంబరాల్లో ముగినిపోయారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. త్వరలో కూటమి సభ్యులు నూతన మేయర్‌ను ఎన్నుకోనున్నారు.