విద్యార్ధులకు మంచి బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు బరితెగించాడు. విద్యార్థులకు మద్యం పోసి, సిగరెట్లు వెలిగించి ఇచ్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కర్నీ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. మద్యం పోసిన ఉపాధ్యాయుడిపై వేటు వేసింది.
మధ్యప్రదేశ్ బార్వారా బ్లాక్‌లోని ఖిర్హానీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో లాల్ నవీన్ ప్రతాప్ సింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం నాడు కొందరు విద్యార్థులకు మద్యం తాగించాడు. దాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్ అయింది. జిల్లా కలెక్టర్ దిలీప్ కుమార్ యాదవ్ వీడియో చూశారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఓపీ సింగ్‌ను ఆదేశించాడు. దీంతో ప్రతాప్ సింగ్‌న సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి నిర్ణయం తీసుకున్నారు.