భారత్ చేపట్టిన చీతా ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. తాజాగా దక్షిణ ఆఫ్రికాలోని బోట్స్వానా నుంచి 8 చీతాలు తీసుకురావాలని నిర్ణయించారు. రెండు విడతల్లో బోట్స్వానా నుంచి చీతాలను తీసుకురానున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ పులుల సంరక్షణ అథారిటీ దీనికి సంబంధించిన సమాచారం అందించింది.మేలో 4 చీతాలు భారత్ చేరుకుంటాయని అధికారులు తెలిపారు. తరువాత మరో 4 చీతాలను తీసుకురానున్నారు.
చిరుత ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.112 కోట్లు వ్యయం చేసింది. ఇందులో 67 శాతం మధ్యప్రదేశ్లోని చిరుత పునరావాసానికి కేటాయించారు. ప్రాజెక్ట్ చీతా కింద చిరుతలను రాజస్థాన్ సరిహద్దుకు సమీపంలోని గాంధీ సాగర్ అభయారణ్యంలోకి దశల వారీగా తరలించనున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర చిరుత సంరక్షణ ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.