మద్యం అమ్మకాల్లో అవినీతి కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సిట్ కార్యాలయానికి ఆయన ఇవాళ ఉదయం 9 గంటలకే చేరుకున్నారు. అధికారులు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని మద్యం కుంభకోణం కేసులో విచారణ చేస్తున్నారు.
వైసీపీ పాలనలో అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ప్రధానంగా లబ్దిపొందిన వారిలో రాజ్ కసిరెడ్డితోపాటు, రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఉన్నారని ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు సమాచారం అందించారు. ఇదే విషయం ఆయన మీడియా ప్రతినిధులకు కూడా వెల్లడించారు.
విజయసాయిరెడ్డి వాంగ్మూలం మేరకు ఇవాళ మిథున్‌రెడ్డిని విచారించే అవకాశముందని తెలుస్తోంది.