ముర్షీదాబాద్, మాల్దా జిల్లాల్లో హిందువుల మీద జరిగిన హింసాకాండ… మృత్యువు విలయతాండవం అని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి ఆనంద బోస్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు ఎంతమాత్రం సహించరానివి అని వ్యాఖ్యానించారు.
ఆనంద బోస్ ఇవాళ బెంగాల్ రాష్ట్రంలో ముస్లిముల హింసతో ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ బెంగాల్లోని వివిధ ప్రదేశాల్లో హింస దాని వికృత రూపాన్ని ప్రదర్శిస్తోందన్నారు. ఈ హింసాత్మక విధానాన్ని శవపేటికలో బంధించి పూడ్చిపెట్టేయాలన్నారు. తన పర్యటన ముగిసిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండను నిలిపివేయడానికి యుద్ధప్రాతిపదికన కార్యాచరణ ప్రారంభిస్తానని చెప్పారు.
గవర్నర్ ఆనంద బోస్ తొలుత మాల్దా, ఆ తర్వాత ముర్షీదాబాద్లలో ముస్లిములు హిందువులపై హింసకు పాల్పడిన ప్రదేశాలను సందర్శించారు.