కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలేరో వాహనం వంతెన గోడకు వేగంగా వచ్చి ఢీ కొనడంతో నలుగురు ఆంధప్రదేశ్ వాసులు మృతి చెందారు. చనిపోయిన వారు హిందూపురానికి చెందిన సోమ, నాగరాజు, నాగభూషన్, మురళిగా గుర్తించారు.
వీరు కర్ణాటకలోని యాద్గిల్ జిల్లా షహర్‌పూర్ సంతలో గొర్రెలను కొనుగోలు చేయడానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రాయచూర్ జిల్లా దేవదుర్గ తాలూకా గబ్బురు పోలీస్ స్టేషన్ పరిధిలోని అమలాపురం వద్ద వీరి వాహనం ప్రమాదానికిగురైంది.