మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందని పోలీసు అధికారులు తెలిపారు.మావోయిస్టులు స్థానిక గిరిజనులపై దురాగతాలు, అమానవీయ భావజాలంతో విసిగిపోయాయని వారు చెప్పారు. లొంగిపోయిన వారిలో 9 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు.
లొంగిపోయిన మావోయిస్టులు చాలా హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ చెప్పారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు మిలటరీ డిప్యూటీ కమాండర్ ముచాకి జోగా, స్క్వాడ్ సభ్యురాలు ముచాకి జోగి ఉన్నారని ఎస్పీ వెల్లడించారు. వీరిపై 8 లక్షల రివార్డు ఉంది.
ఏరియా కమిటీ సభ్యులు దేవే, దుధి బుధ్రాలపై ఒక్కొక్కరిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. మరో ఏడుగురిపై రూ.2 లక్షల చొప్పున రివార్డు, ఒకరిపై రూ.50 వేల రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున సాయం అందింారు. ప్రభుత్వం నుంచి పునరావాస పథకం అమలు చేయనున్నారు. గత ఏడాది సుక్మా జిల్లాలో 792 మంది మావోయిస్టులు లొంగపోయినట్లు ఎస్పీ గుర్తుచేశారు.
హోమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టులను తుడిచిపెడతామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. మావోయిస్టులు లేని భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.